Zika Virus: దేశంలోకి ప్రవేశించిన కొత్త వైరస్.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు
Zika Virus is Said to have Confirmed In Hyderabad| దేశంలో రెండేళ్లనుంచి కలవరపాటుకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇంకా ముగియక ముందే.. మరో వైరస్ ఎంట్రీ ఇచ్చి ప్రజలను భయపెడుతోంది. తాజాగా, భారత్‌లో ప్రమాదకర జీకా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది
దిశ, వెబ్‌డెస్క్: Zika Virus is Said to have Confirmed In Hyderabad| దేశంలో రెండేళ్లనుంచి కలవరపాటుకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇంకా ముగియక ముందే.. మరో వైరస్ ఎంట్రీ ఇచ్చి ప్రజలను భయపెడుతోంది. తాజాగా, భారత్‌లో ప్రమాదకర జీకా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి పెరిగే అవకాశముందని ఇటీవల పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV) నిర్వహించిన అధ్వయనంలో తేలింది. ఇప్పటికే జీకా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని తెలిపింది.
అధ్యయనం వివరాలను మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలోనూ ఇటీవలే ప్రచురించారు. పరిశోధనలో భాగంగా మొత్తం 1475 నమూనాలను సేకరించి పరీక్షించగా.. అందులో 64 నమూనాలు పాజిటీవ్‌గా తేలాయని ఎన్‌ఐవీ వెల్లడించింది. కాగా, తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజిలో సేకరించిన నమూనాలో కూడా జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు జీకా వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతోందని అధ్యయనం వెల్లడించింది. ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జీకా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది.