జుట్టు ఊడిపోతుందని యువతి బలవన్మరణం..

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో కొంత మంది చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురవుతున్నారు..Latest Telugu News

Update: 2022-07-03 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో కొంత మంది చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురవుతున్నారు. తేలికైన ప్రాబ్లమ్స్‌కు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇటీవల ఇలాంటివి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే జుట్టు రాలిపోతుందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన మైసూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మైసూర్‌లోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్‌లో కావ్యశ్రీ (21) కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఇటీవల ఓ వింత జబ్బు కారణంగా తలకున్న వెంట్రుకలు రాలడం ప్రారంభమైంది. కొన్ని రోజుల్లోనే చూస్తుండగానే జుట్టు మొత్తం ఊడిపోయింది. దీనికి ఎన్ని చికిత్సలు చేయించుకున్నా లాభం లేకుండా పోవడంతో, విసుగు చెంది కావ్యశ్రీ తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ తర్వాత ఆమెను చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News