అత్తమామలు తన డైరీ చదివారని యువతి సూసైడ్..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలామంది యువతీ, యువకులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురవుతున్నారు..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలామంది యువతీ, యువకులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురవుతున్నారు. దాంతో ఎంతటి ఘోరానికైనా పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ యువతి అత్తమామలు తన పర్సనల్ డైరీ చదివారని దారుణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్టకు చెందిన నికితా డహట్ తన అత్తమామలతో నివాసం ఉంటూ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఈ మధ్యే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే తనకు డైరీ రాసే అలవాటు ఉంది. దాంతో ప్రతి విషయాన్ని తన డైరీలో రాసుకునేది. కానీ, ఆమె ఇంట్లో లేని సమయంలో ఒకరోజు తన అత్తమామలు ఆ యువతి డైరీ చదివారు. అందులో ఓ చోట తన అత్త 'దెయ్యం' లాంటిదని రాసింది. దీంతో నికిత అత్త విపరీతమైన కోపంతో బంధువులను పిలిచి పంచాయితీ పెట్టింది. నికితను ఆమె బంధువులు ఇంకోసారి అలా చేయొద్దని మందలించారు. దాంతో నికిత తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మహారాష్ట్రలోని సావనేర్ పోలీసు స్టేషన్‌లో మృతురాలి సోదరుడు పంకజ్ నికిత అత్తమామలపై ఫిర్యాదు చేశాడు.