బీసీ జనగణన జరపండి.. ప్రధాని మోడీకి వైసీపీ ఎంపీల విజ్ఞప్తి
దిశ, ఏపీ బ్యూరో: బీసీ జనగణన జరపాలని ప్రధాని - YCP MPs appeal to PM Modi to conduct BC census
దిశ, ఏపీ బ్యూరో: బీసీ జనగణన జరపాలని ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని బుధవారం వైసీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ జనగణన జరపాలని ప్రధానికి రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. బీసీ జనగణన చేయాలని.. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభలో తగిన ప్రాతినిధ్యం లేదని చెప్పుకొచ్చారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పార్లమెంట్, శాసనసభ, న్యాయ వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నారని.. అయినా బీసీలను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా చట్టసభల్లో మాత్రం తగిన ప్రాతినిధ్యం లేదని వాపోయారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన ప్రణాళికను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు రాజ్యసభ సభ్యులు తెలిపారు.