గోలీసోడా కావాలా అంటూ పవన్ కళ్యాణ్ బ్యూటీ పోస్ట్.. హీరోయిన్ అయినంత ఈజీ కాదు సోడా కొట్టడం అంటూ కామెంట్స్

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే.

Update: 2025-04-08 06:23 GMT
గోలీసోడా కావాలా అంటూ పవన్ కళ్యాణ్ బ్యూటీ పోస్ట్.. హీరోయిన్ అయినంత ఈజీ కాదు సోడా కొట్టడం అంటూ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా అనన్య నాగళ్ల ఇన్‌స్టాగ్రామ్‌లో గోలీసోడా కొడుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘గోలీసోడా కావాలా’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హీరోయిన్ అయినంత ఈజీ కాదు సోడా కొట్టడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News