Sai Pallavi: ట్వీట్‌తో చిక్కుల్లో పడిన సాయి పల్లవి.. నీ గురించి నిజాలు తెలుసు డ్రామాలు చేయకంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఏకంగా 28 మంది మరణించిన విషయం తెలిసిందే.

Update: 2025-04-24 10:12 GMT
Sai Pallavi: ట్వీట్‌తో చిక్కుల్లో పడిన సాయి పల్లవి.. నీ గురించి నిజాలు తెలుసు డ్రామాలు చేయకంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఏకంగా 28 మంది మరణించిన విషయం తెలిసిందే. అక్కడి అందమైన ప్రాంతాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు కులం అడిగి మరీ దాడి చేయడం విషాదకరం. ఇక ఇందులో ఎంతోమంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ సంఘటన మంగళవారం జరగ్గా అప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ ఉగ్రదాడిపై యావత్ భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అలాగే పాకిస్తాన్ నటీనటులపై కూడా బ్యాన్ విధించినట్లు సమాచారం.

ఇక ఈ క్రమంలోనే సాయి పల్లవి గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ‘‘మన ఆర్మీ పాకిస్తాన్ జనాలను ఉగ్రవాదులు అనుకుంటుంది. వారు కూడా ఇండియా ప్రజలు అలాగే అనుకుంటారు. అసలు ఇదే హింసలు దారితీస్తుంది. మనం ఆలోచించే విధానం అలాంటిది’’ అని చెప్పుకొచ్చిన వీడియో పలు విమర్శలకు దారితీసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు దారుణంగా తిడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సాయి పల్లవి(Sai Pallavi) ఉగ్రదాడిపై ట్వీట్ చేసింది. ‘‘నష్టం, నొప్పి, భయం వ్యక్తిగతంగా అనిపిస్తుంది. చరిత్రలో భయంకరమైన నేరాల గురించి తెలుసుకున్నా. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఏమీ మారలేదు.

జంతువుల సమూహం ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించుకోవాలనుకునే మనస్తత్వం నుండి, మీ స్పృహ నుండి విసిరివేయబడటం, మీ కుటుంబం చంపబడటం చూడటం.. ఇది నన్ను మన కోర్కెను ప్రశ్నించేలా చేస్తుంది. నిస్సహాయంగా, శక్తిలేని, నేను కోల్పోయిన అమాయక జీవితాలకు వేదనలో ఉన్న కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని, ప్రార్థనలను తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ఇక అది చూసిన వారంతా ఆమె పాత వీడియోను షేర్ చేస్తూ మండిపడుతున్నారు. నువ్వు ఇలా మాట్లాడినప్పుడే నువ్వు ఎలాంటి దానివో అర్థం అయింది. స్మార్ట్‌గా నటిస్తూ డ్రామాలు చేయకంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News