వాట్సాప్ కొత్త ఫీచర్‌.. ఎమోజిలతో సులభంగా రిప్లై

దిశ,వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్..telugu latest news

Update: 2022-03-23 15:48 GMT

దిశ,వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. మెసేజ్ రియాక్షన్స్ కోసం ఎమోజిల ద్వారా రిప్లై ఇవ్వడానికి కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది. కొత్తగా బీటా వెర్షన్ 2.22.8.3ని విడుదల చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఎమోజి రియాక్షన్‌‌‌లను తొందరగా, సులభంగా ఇవ్వడానికి వీలుంటుంది. మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ సేపు నొక్కి పట్టుకోవడం ద్వారా ఆరు ఎమోజిలు కనిపిస్తాయి. అవి థంబ్స్ అప్, గుండె, ఏడుపు, నవ్వు, షాక్ అయిన ముఖం, ధన్యవాదాలు. వీటిని టచ్ చేయడం ద్వారా రిప్లై ఇవ్వడం వినియోగదారులకు సులభంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. వాట్సాప్ దశలవారీగా ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేయనుంది. దీనితో పాటు iOS, డెస్క్‌టాప్ అప్లికేషన్‌ల కోసం ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను పరిక్షిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News