Vijaya Shanthi: ఉద్ధవ్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు : విజయశాంతి
Vijaya Shanthi Criticized on Maharashtra government | సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే.. అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని అంటూ.. మహారాష్ట్ర సంక్షోభంపై విజయశాంతి ట్విట్టర్ ద్వారా
దిశ, వెబ్‌డెస్క్ : Vijaya Shanthi Criticized on Maharashtra government| సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే.. అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని అంటూ.. మహారాష్ట్ర సంక్షోభంపై విజయశాంతి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఉద్ధవ్ తండ్రి బాల్ థాకరే 'శివసేన పార్టీ' స్థాపించారు. పొత్తులు, సంకీర్ణ సర్కార్లపై బాల్ థాక్రే గారు గతంలో స్పందిస్తూ.. ఏ పార్టీకి మెజారిటీ ఉందో ఆ పార్టీ మాత్రమే సంకీర్ణ సర్కార్‌కు నేతృత్వం వహించాలని కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ఉద్ధవ్ ఇవన్నీ తుంగలో తొక్కి, కేవలం అధికారం కోసం తండ్రి వ్యతిరేకించిన పార్టీలతోనే చేతులు కలిపి శివసేనని మలినం చేశారు అని ఆమె మండిపడ్డారు.
చిరకాల మిత్రుడిగా ఉంటూ వచ్చిన బీజేపీని దూరం చేసుకున్నారు. చివరికిప్పుడు సొంత పార్టీవారే తిరుగుబాటు చెయ్యగా.. దిక్కులేక సీఎం పీఠాన్ని వదులుకునేందుకు సిద్ధ పడాల్సి వచ్చింది. ఉద్ధవ్‌కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ఉండటం ఎంత ప్రమాదకరమో చివరికి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు గ్రహించినా ఉద్ధవ్ మేలుకోకపోవడం ఈ పరిస్థితులకి దారి తీసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు అని ఆమె పేర్కొన్నారు. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోంది అని విజయశాంతి అంచనా వేశారు.