యువ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే(Ananya Pandey) పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-11-12 04:40 GMT
యువ క్రికెటర్‌ను పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్?
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే(Ananya Pandey) పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అమ్మడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) సరసన ‘లైగర్’ మూవీలో నటించింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే అనన్య పాండే బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇటీవల ఈ భామ ‘CTRL’ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం అందుకుంది.

అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అనన్య పాండే పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా ఆదిత్య రాయ్ కపూర్‌(Aditya Roy Kapur)తో డేటింగ్ చేసిన ఆమె బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు ఓ యువ క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్. అతనెవరో కాదు.. రియాన్ పరాగ్(Riyan Parag). ఆయన ఇటీవలే టీమ్ ఇండియా ఆట‌గాడిగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

అయితే భుజం గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌లో ఆడ‌లేక‌పోయాడు. మ‌రోవైపు అనన్య పాండేతో అతడి వివాహం జరగబోతోందనే ప్రచారం నెట్టింట దుమారం రేపుతోంది. ఫిబ్రవరి 2025లో పెళ్లి చేసుకోవచ్చని కూడా వార్తలు వైరల్‌గా మారాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.


Tags:    

Similar News