Vijay Deverakonda: మెట్ల మీద జారి పడ్డ రౌడీ.. ట్రోలర్స్ కి చెంప చెల్లుమనే కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ?

విజయ్ వారందరికీ చెంప చెల్లుమనే విధంగా సమాధానం ఇచ్చాడు.

Update: 2024-11-11 02:15 GMT
Vijay Deverakonda: మెట్ల మీద జారి పడ్డ రౌడీ.. ట్రోలర్స్ కి చెంప చెల్లుమనే  కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : అర్జున్ రెడ్డితో (Arjun Reddy) ఓవర్ నైట్ లో స్టార్ గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరో అయ్యాడు. కానీ, ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ను చూస్తున్నాడు. ఈ రౌడీ హీరో ఎంత సక్సెస్ చూసాడో అంత కంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూసాడు.దీంతో, సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మీద దారుణమైన ట్రోల్స్ చేశారు. కొంతమంది అయితే విజయ్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉండేవారు.

అయితే, రెండు రోజుల క్రితం విజయ్ ఓ ఈవెంట్ కి వెళ్లే మార్గంలో మెట్ల మీద నుంచి దిగుతుంటే కాలు జారి కింద పడ్డాడు. దీంతో, చాలా మంది ఈ వీడియోను ట్రోల్స్ చేశారు. అయితే, తాజాగా విజయ్ వారందరికీ చెంప చెల్లుమనే విధంగా సమాధానం ఇచ్చాడు.

విజయ్ కు క్లాత్ బిజినెస్ ఉన్న విషయం మనకీ తెలిసిందే. మెట్ల మీద కింద పడ్డ వీడియోకి ఇంకో వీడియో జత చేసి ఎడిట్ చేసాడు. " నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ తో ప్రేమలో పడుతూనే ఉంటాను. రౌడీ వేర్ తో కూడా అందరూ ప్రేమలో పడతారు " అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. దీంతో, ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇక విజయ్ ఫ్యాన్స్.. నీ తెలివికి జోహార్లు , ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Full View

Tags:    

Similar News