వ్యాక్సిన్ కొత్త రేట్లు ప్రకటించిన సంస్థలు.. ఒక్కో డోసు రూ.1,200 నుంచి..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశ ప్రజలంతా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ప్రికాషినరీ వ్యాక్సినేషన్ గురించే ఆలోచిస్తున్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లు మళ్లీ ఆకాశాన్నంటే రేట్ల సామాన్యుడిపై భారం మోపుతాయని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం ముందస్తు ప్రకటనలతో ప్రైవేటు వారి రేట్లకు కళ్లేలు వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్కో డోసుకు రూ.150 మాత్రమే చార్జ్ చేయాలని ప్రకటించింది. కానీ తాజాగా ఈ రేట్లలో మార్పులు చేస్తూ సీరం ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఇండియా సరికొత్త ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో కొవిషీల్డ్ ధరను పేర్కొంది. కొవీషీల్డ్ ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆసుపత్రలు రూ.600 నుంచి రూ.225 మధ్యలో అందించాలని సీరమ్ పేర్కొంది. అయితే భారత్ బయోటెక్ కూడా తన వ్యాక్సిన్ డోస్ ధరల విషయంలో మార్పులు చేసింది. కో-వ్యాక్సిన్ డోసుకు రూ.1,200 నుంచి రూ.225 మధ్య మాత్రమే చార్జి చేయాలని పేర్కొన్నారు.