Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి స్థానంలో కేంద్ర మంత్రి?

Union Minister Mukhtar Abbas Naqvi To Replace Vice President Venkaiah Naidu| తెలుగు వ్యక్తిగా ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి భవిష్యత్ పై అప్పుడే రాజకీయ చర్చ మొదలైంది.

Update: 2022-06-22 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Union Minister Mukhtar Abbas Naqvi To Replace Vice President Venkaiah Naidu| తెలుగు వ్యక్తిగా ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి భవిష్యత్ పై అప్పుడే రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. దక్షిణాదిన కమలం పార్టీకి ఆయనో పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు. మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగిన వెంకయ్య నాయుడు ఆ తర్వాత ఉప రాష్ట్రపతిగా అవకాశం రావడంతో ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. త్వరలో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే రాష్ట్రపతి పదవికి ఆయన పేరునే ఖరారు చేస్తారనే ప్రచారం జరిగినా ద్రౌపది పేరు ఫైనల్ కావడంతో వెంకయ్య నాయుడుని ప్రెసిడెంట్ హోదాలో చూద్దామని భావించిన తెలుగు వ్యక్తులకు నిరాశే మిగిలింది. ఇదిలా ఉంటే వెంకయ్య నాయుడిని కావాలనే పక్కకు పెట్టేశారనే చర్చ జోరుగా సాగుతోంది.

సైలెంట్‌గా సైడ్ చేశారా?

జాతీయ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా వెంకయ్య నాయుడు తానేంటో నిరూపించుకుంటున్నారు. ఈయన విషయంలో ప్రత్యక్షంగా పోటీ చేసిన వాటి కంటే రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భాలే ఎక్కువ. అటల్ బీహారి వాజ్ పేయ్‌కు మంచి సన్నిహితుడిగా పేరు ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ఓ వైపు కేంద్ర మంత్రిగా యాక్టివ్ పాలిటిక్స్ లో కొనసాగుతుండగానే ఆయన్ను బీజేపీ పెద్దలు ఉపరాష్ట్ర పతి పదవికి నామినేట్ చేశారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరం కావాల్సి వచ్చింది. ఆయన్ను రాజకీయాలకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆ సమయంలోనే ఊహాగానాలు వచ్చాయి. తాజాగా రాష్ట్రపతి పదవి వరిస్తుందని అంతా భావించినా మరోసారి నార్త్ ఇండియన్‌కే ఆ ఛాన్స్ దక్కడంతో వెంకయ్య నాయుడు అభిమానులు, వెల్ విషెర్స్ నిరుత్సాహ పడ్డారు. కావాలనే వెంకయ్య నాయుడిని సైడ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వెంకయ్య నాయుడు స్థానంలో కేంద్రమంత్రి?

అంతా భావించినట్లుగా ప్రెసిడెంట్ పోస్ట్ రాకపోవడంతో ఉప‌రాష్ట్రప‌తిగా కూడా కేంద్రం కొన‌సాగిస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీల‌కంగా మారింది. ఈ అవ‌కాశం మ‌రో మైనార్టికి ద‌క్కేలా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు అంచనాలు వేస్తుండటం మరింత ఉత్కంఠకు దారి తీస్తోంది. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి పదవికి కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని నిలబెట్టే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న నఖ్వీ రాజ్యసభ పదవీకాలం ఇటీవలే ముగిసిపోయింది. కానీ మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దాంతో యూపీలోని రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. కానీ అక్కడ కూడా ఆయన పోటీలో లేరు. దీంతో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నఖ్వీని ఉప రాష్ట్రపతి పోస్టుకు నామినేట్ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం నఖ్వీకి ఉప రాష్ట్రపతి పదవి గనుక వస్తే ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వెంకయ్య నాయుడు భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నగా మారుతోంది.

Tags:    

Similar News