రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానించింది.. Smriti Irani ఫైర్

President Of India Was being Insulted By Congress, Says Smriti Irani| కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముర్మును అవమానించిందని ఆగ్రహం

Update: 2022-07-28 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : President Of India Was being Insulted By Congress, Says Smriti Irani| కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లోక్ సభలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముర్మును అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యుల నినాదాలతో గురువరాం లోక్ సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్నిగా అభివర్ణించారు. దీంతో ఆయన ముర్మును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ మండిపడుతోంది. అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: కేంద్రానికి రాహుల్ 10 ప్రశ్నలు

Tags:    

Similar News