సినిమా తరహాలో గంజాయి రవాణా.. కర్రల మధ్యలో పెట్టి..

దిశ, హన్మకొండ టౌన్ : సినిమా తరహాలో ఓ లారీలో పేపర్ తయారీకి..Two Arrested, Ganza seized

Update: 2022-03-09 10:24 GMT

దిశ, హన్మకొండ టౌన్ : సినిమా తరహాలో ఓ లారీలో పేపర్ తయారీకి వాడే నీలగిరి కర్రలు లోడ్ చేసి మధ్యలో భారీగా గంజాయి ఉంచి రవాణా చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న టాక్ ఫోర్స్, ధర్మసాగర్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. బీదర్ జిల్లాకు చెందిన ఆహ్మద్ ఖాన్, జాదవ్ తుకారాం, రాథోడ్ కాశీనాథ్, రాథోడ్ సంతోష్, రాథోడ్ సక్రం, జైబాయి, నూకరాజు, బాలరాజు, దాసు ట్రాన్స్ పోర్ట్ లారీలో పౌల్ట్రీకి సంబంధించిన ఉత్పత్తులను కర్నాటక రాష్ట్రం నుండి రాజమండ్రి పట్టణానికి తరలించారు. నిందితులు అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో కొయ్యూరు నుండి కాగితం తయారీకి వినియోగించే నీలగిరి కర్రలను లారీలో నింపుకుని కాశీనాథ్, సంతో ఆదేశాల మేరకు నిందితులు చింతలూరు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల నుండి రెండు కిలోల ప్యాకెట్ల చొప్పున 287 ప్యాకెట్లకు సంబంధించి మొత్తం 574 కిలోల గంజాయిని లారీలోని నీలగిరి కర్రల మధ్య ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా భద్రపరిచి తిరిగి కర్నాటకు బయలుదేరారు. ఆ లారీ కొత్తగూడ, ఏటూరునాగరం, ములుగు మీదుగా తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ధర్మసాగర్ పోలీసులు ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల టోల్ గేట్ ప్రాంతంలో లారీని ఆపి తనిఖీ చేశారు. కర్రల మధ్యలో గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితులు ఆహ్మద్ ఖాన్, జాదవ్ తుకారాంలను అరెస్టు చేసి విచారించగా గంజాయి రవాణాకు పాల్పడుతున్నట్లుగా అంగీకరించారు. వారిని అదుపులోకి తీసుకుని లారీలో తరలిస్తున్న రూ.57 లక్షల 40 వేలు విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాటిని సీజ్ చేశారు. 9 మంది నిందితుల్లో ఏడుగురు రాథోడ్ కాశీనాథ్, రాథోడ్ సంతోష్, రాథోడ్ సక్రం, జైబాయి, నూకరాజు, బాలరాజు, దాసులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ ఇన్వాడ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, టాస్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్, ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ రమేశ్ తో పాటు ధర్మసాగర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు సాయిబాబా, లవణ్ కుమార్, కానిస్టేబుళ్ళు శ్రీను, శ్రవణ్ కుమార్, రాజేష్, రాజు, భిక్షపతి, రాజేశ్, హోంగార్డ్ విజయ్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Tags:    

Similar News