'అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి'

దిశ, భువనగిరి రూరల్: అరెస్టు చేసిన జర్నలిస్టులను - TUWJ state president Allam Narayana demanded the immediate release of the arrested journalists

Update: 2022-04-05 13:25 GMT

దిశ, భువనగిరి రూరల్: అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయ వార్త సేకరణకు వెళ్ళే జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, తెంజూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్, రమణ కుమార్ లు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యాదగిరిగుట్ట పై మీడియా పాయింట్ పెట్టినా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత రెడ్డి అక్కడికి మీడియా వాహనాలను మాత్రం అనుమతించబోమని, బస్సులలో కవరేజ్ కు రావాలని చెప్పడం ఎంత మాత్రం సహేతుకంగా లేదన్నారు. కొండపైన ఉద్యోగాలు చేసే వారి వాహనాలను అనుమతించే అధికారులు.. అదే విధి నిర్వహణ కోసం జర్నలిస్ట్ మీడియా పాయింట్ కి వెళ్లడానికి అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ విషయం పై ఆలయ కార్యనిర్వహణ అధికారి సానుకూలంగా నిర్ణయం తీసుకొని, మీడియా వాహనాలను అనుమతించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కల్పించుకొని, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కేటాయించినట్లు అన్ని పత్రికల, ఛానల్ ప్రతినిధుల కోసం కాటేజీలు సైతం కేటాయించాలన్నారు.

Tags:    

Similar News