కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ గిరిజనుల వంటా-వార్పు

దిశ, నిర్మల్ కల్చరల్: వారంతా అడవులకు ఆనుకుని ఉండే గూడాల్లో నివసించే..tribals stage protest at Collectorate

Update: 2022-03-16 06:12 GMT

దిశ, నిర్మల్ కల్చరల్: వారంతా అడవులకు ఆనుకుని ఉండే గూడాల్లో నివసించే ఆదివాసీ గిరిజనులకు కావాల్సిందల్లా కరెంటు, తాగునీళ్లు మాత్రమే. తమ గూడెంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామ ఆదివాసి గిరిజనులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం వంటావార్పు చేపట్టారు. పాదయాత్రగా 75 కిలోమీటర్లు పిల్లాపాపలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మంగళవారం తమ సంప్రదాయ నృత్యాలు చేశారు. రాత్రి అక్కడే టెంట్ లో నిద్రించారు. తమకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని గత ఏడాది జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి చెలిమెల్లోని నీరు తాగుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. సమస్యలు పరిష్కరించేంతవరకు కలెక్టరేట్ ఎదుట మరింత ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Tags:    

Similar News