నీట్‌లో మెరిసినా.. ఎదగనివ్వని పేదరికం..!! ఆపన్న హస్తాల కోసం ఎదురుచూపులు

దిశ, తుంగతుర్తి: పట్టుదలతో ఊహించని విజయాలు సొంతం చేసుకుంటూ పైకి ఎగబాకుతున్న..Tribal Student Clears NEET Exam; Urges For Financial Aid To Study Medicine

Update: 2022-03-12 10:31 GMT

దిశ, తుంగతుర్తి: పట్టుదలతో ఊహించని విజయాలు సొంతం చేసుకుంటూ పైకి ఎగబాకుతున్న ఓ పేదింటి గిరిజన కుసుమాన్ని కష్టాల సుడిగుండం తన బందీగా చేసుకుంది. ఆర్థిక పరమైన అంశాలు పైకి ఎదగనివ్వకుండా అణువనువునా అడ్డంకులు సృష్టిస్తోంది. చేసేదేమీలేక ఎంబీబీఎస్ లో సీటు సాధించిన గిరిజన కుసుమం దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తోంది. తుంగతుర్తి మండలం ఏనేకుంటతండా గ్రామానికి చెందిన బానోతు ప్రేమ్ కుమార్ దీనావస్థ ఇది. బానోతు బిచ్చ-అచ్చాలి దంపతులది అత్యంత పేద కుటుంబం. కూతురు స్వరూప డిగ్రీ, మరో కుమారుడు గణేష్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే పిల్లల చదువు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులతో ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినా వారంతా చదువులో రాణిస్తున్నారు. పిల్లలను కదిలించిన తల్లిదండ్రుల కష్టం విద్యలో విజయాలవైపు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగానే ప్రేమ్ కుమార్ వివిధ ప్రాంతాలలో ఒక లక్ష్యంతో సాగించిన చదువుల్లో అగ్ర పథాన నిలిచి చివరికి నీట్ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్ లో 5 వేల 398 ర్యాంకుతో సీటు సాధించాడు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో విద్యాభ్యాసం కొనసాగించాల్సి ఉంది. అయితే దీనికయ్యే వివిధ రకాల ఖర్చులు ప్రవీణ్ కుమార్ కు తలకు మించిన భారంగా మారింది. దాతలు ఆదుకుంటేనే తన చదువు కొనసాగుతుందని.. లేనిపక్షంలో వైద్య వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రేమ్ కుమార్, అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసాయం చేయాలనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్... 9392403044

Tags:    

Similar News