హిజ్రాలుగా పుట్టడం తప్పా.. మా ప్రాణాలకు దిక్కెవరూ..?

దిశ, భద్రాచలం: హిజ్రాలుగా పుట్టడం తప్పా.. మా ప్రాణాలకు దిక్కెవరు..Transgender in Tension at Khammam

Update: 2022-03-11 13:31 GMT

దిశ, భద్రాచలం: హిజ్రాలుగా పుట్టడం తప్పా.. మా ప్రాణాలకు దిక్కెవరు అని భద్రాచలం హిజ్రా యూనియన్ ప్రెసిడెంట్ కుమారి, రమ్య, సత్యలు ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...రోజు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న భద్రాచలం శిల్పా‌నగర్‌కు చెందిన హిజ్రా నిమసకవి సనను శ్యామ్ అనే వ్యక్తి చంపడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. నర్సమ్మ, స్వప్న, సాయి అనే వాళ్లు శ్యామ్‌ని రెచ్చగొట్టి పంపించారని ఆరోపించారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్యామ్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి.. హిజ్రా నిమసకవి సనను జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులిమి, కత్తితో హత్యాప్రయత్నం చేయగా తప్పించుకొని..100కు పోన్ చేయడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారని తెలిపారు. ఇలా తమపై దాడులు చేస్తే ప్రాణాలకు దిక్కెవరు, తాము హిజ్రాలుగా పుట్టడమే తప్పా అని ప్రశ్నించారు. ఇకపై హిజ్రాల మీద దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారించి, బాధిత హిజ్రాకు న్యాయం చేయాలని గుమ్మడి రాజు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News