తక్షణమే తెలంగాణకు రూ.2000 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి రేవంత్ లేఖ

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఏర్పడిన వరదల పరిస్థితిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Update: 2022-07-16 11:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఏర్పడిన వరదల పరిస్థితిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తెలంగాణలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా గుర్తించి, తక్షణమే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను రాష్ట్రంలో మోహరించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ. 2000 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. వరదలతో తెలంగాణ అతలాకుతలమైందని, రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అన్నారు. వరద పరిస్థితిని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని రేవంత్ విమర్శించారు. తెలంగాణలో ఎకరం పంట కూడా మునగలేదని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు, ఈ విషయం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఒకవేళ నష్టం వాటిల్లిందని రుజువు చేస్తే కేటీఆర్‌ ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతులకు క్షమాపణ చెబుతారా? అని రేవంత్ సవాల్ చేశారు. కాగా, భారీ వర్షాలకు 857 గ్రామాల్లో వరద నీరు చేరిందని, రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఏర్పడిన పరిస్థితిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావడానికి జాతీయ విపత్తు ప్రతి స్పందన దళాన్ని తక్షణమే పంపించాలని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని వెంటనే పంపాలన్నారు. రైతులకు ఎకరాకు రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని, పంటలను తిరిగి సాగు చేసేందుకు విత్తనాలు, సబ్సిడీలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


Similar News