బీఎస్పీతోనే రాష్ట్రంలో సంక్షేమం సాధ్యమన్న మాయావతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలింగ్ ప్రక్రియ సోమవారంతో ముగియనుండడంతో..latest telugu news

Update: 2022-03-06 15:18 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలింగ్ ప్రక్రియ సోమవారంతో ముగియనుండడంతో బహుజన సమాజ్ పార్టీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఎస్పీ ఉక్కు ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చేయడానికి సమయం అసన్నమైందని అన్నారు. 'సోమవారం యూపీలో 9 జిల్లాల్లో 54 సీట్లకు చివరి దశ పోలింగ్ జరగనుంది.

పేదరికం, నిరుద్యోగం ఎదుర్కొంటున్న నిర్లక్ష్యానికి గురైన ప్రజలు తమ ఓట్ల బలంతో తమ విధిని, రాష్ట్రాన్ని మార్చుకోవడానికి కృషి చేయాలి. బీఎస్పీ నేతృత్వంలో రాష్ట్రంలో ఉక్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది' అని ట్వీట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు తమ తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ప్రజలకు మంచి రోజులు వస్తాయని మాయ మాటలు చెబుతున్నారని విపక్ష పార్టీలను విమర్శించారు. కాగా సోమవారంతో యూపీలో పోలింగ్ ముగియనుంది.

Tags:    

Similar News