థాయ్ ఓపెన్ బాక్సింగ్‌లో భారత కుర్రాళ్ల హవా
ఫూకెట్: థాయ్‌లాండ్ ఓపెన్ బాక్సింగ్-2022లో - Three Indian boxers have qualified for the final of the Thailand Open Boxing-2022
ఫూకెట్: థాయ్‌లాండ్ ఓపెన్ బాక్సింగ్-2022లో భారత్ బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. శుక్రవారం జరిగిన సెమీస్ ఫైట్‌లో అమిత్ పంగాల్, అనంత చోపడే, సుమీత్ ముగ్గురు బాక్సర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఇదే సమయంలో ముగ్గురు భారతీయ మహిళా బాక్సర్లు మనీషా (57 కేజీలు),పూజా(69 కేజీలు), భాగ్యభాటి కచారి(75 కేజీల) విభాగంలో పోటీ పడి క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలై కాంస్య పతకాలు సాధించారు. 2018 ఆసియన్ గేమ్స్ చాంపియన్ అమిత్ పంగల్ (52 కేజీల) విభాగంలో వియత్నాం బాక్సర్ ట్రాన్ వాన్ తావోపై సెమీస్‌లో విజయం సాధించాడు.
మరో బాక్సర్ చోపడే 75 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ బు ట్రాంగ్ తాయ్ పై 5-0 తేడాతో సెమీస్‌లో గెలుపొందాడు. సుమిత్ 54 కేజీల విభాగంలో కజకిస్తాన్ బాక్సర్ అయతుల్లా తాకిజనోవ్ మీద 4-1 తేడాతో సెమీస్‌లో గెలుపొంది ఫైనల్‌కు అర్హత పొందాడు. కాగా, ఆశిశ్ కుమార్ (81 కేజీ), మౌనిక (48 కేజీ), గోవింద్ సహాని (48 కేజీ), వారిందర్ సింగ్ (60 కేజీ) భారత బాక్సర్లు ఇప్పటికే ఫైనల్ చేరుకున్నారు. మొత్తంగా 7గురు బాక్సర్లు బంగారు పతకం వేటలో నిమగ్నమయ్యారు. వీరికి శనివారం ఫైనల్ పోటీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.