రిమోట్ కంట్రోల్ సర్జరీ.. 'మ్యాగ్నెట్ కాథెటర్‌తో' సాధ్యం!

దిశ, ఫీచర్స్ : మెదడులో గడ్డకట్టిన రక్తపు ముద్దలను విచ్ఛిన్నం చేసేందుకు సర్జన్లు సాధారణంగా ‘కాథెటర్’గా పిలవబడే సన్నటి, పొడవైన గొట్టాన్ని ఉపయోగిస్తారు.

Update: 2022-07-24 07:16 GMT

దిశ, ఫీచర్స్ : మెదడులో గడ్డకట్టిన రక్తపు ముద్దలను విచ్ఛిన్నం చేసేందుకు సర్జన్లు సాధారణంగా 'కాథెటర్'గా పిలవబడే సన్నటి, పొడవైన గొట్టాన్ని ఉపయోగిస్తారు. కానీ ఈ ప్రక్రియకు స్థిరమైన చేతి నైపుణ్యం అవసరం. ఈ నేపథ్యంలోనే ఈటీహెచ్ జ్యూరిచ్‌లోని పరిశోధకులు అయస్కాంతాల ద్వారా రిమోట్‌గా నియంత్రించగలిగే కాథెటర్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా టెలీ-సర్జరీకి తలుపులు తెరుస్తున్న పరిశోధకులు.. ఈ పరికరాన్ని క్లినికల్ యూజ్‌కు సిద్ధం చేసేందుకు గత నవంబర్‌లో 'నానోఫ్లెక్స్' పేరుతో కంపెనీ స్థాపించారు.

పరిశోధకులు అయస్కాంత వ్యవస్థను ఉపయోగించి తక్కువ పరిమాణంలో సౌకర్యవంతమైన కాథెటర్‌ రూపొందించారు. అచ్చం వీడియో గేమ్ కంట్రోలర్‌ మాదిరిగా పనిచేసే ఈ పరికరం ఏ దిశలోనైనా కదులుతుంది. సంప్రదాయ వైర్ కాథెటర్స్‌కు భిన్నంగా ముందుకు, వెనుక్కి మాత్రమే లాగబడుతుంది. త్వరలోనే హార్ట్ స్ట్రోక్ రోగులు అయస్కాంత, రిమోట్-నియంత్రిత 'కాథెటర్స్' ద్వారా ప్రయోజనం పొందే అవకాశముంది. ఇది వారి రక్తం గడ్డలను తొలగించడం సహా దీర్ఘకాలికంగా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్రొటోటైప్ కాథెటర్ పనితీరుపై 2017లో జరిగి అధ్యయనంలో.. సంక్లిష్ట మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని నావిగేట్ చేయడంలో పరికరం మరింత నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఇంతకుముందున్న వైర్ కాథెటర్ మెదడులోకి చేరుకోని ప్రాంతాలను యాక్సెస్ చేయడంలో ఇది సామర్థ్యాన్ని కలిగి ఉండగా, ఈ సాంకేతిక రాబోయే రోజుల్లో బ్రెయిన్ సర్జరీకి కొత్త మార్గాన్ని అందించడమే కాక రోగుల ప్రాణాలు రక్షించేందుకు తప్పక ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

'మా సిస్టమ్‌తో, దూరం నుంచే రిమోట్ కంట్రోల్ ద్వారా స్క్రీన్‌పై విధానాలను నిర్వహించడం సాధ్యమవుతుంది. గుండెపోటు రోగులకు ఇటువంటి పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడం ఎక్కువ కాలం కొనసాగితే వారు మరింత ప్రమాదంలో పడే అవకాశముంటుంది. శిక్షణ పొందిన న్యూరో సర్జన్లు అందుబాటులోలేని చిన్న చిన్న వైద్య కేంద్రాల్లో ఈ విధానంలో శస్త్రచికిత్స చేయడం సులభమవుతుంది.

- సిల్వియా వివియాని, నానోఫ్లెక్స్ ఇంజనీర్

Tags:    

Similar News