చంపిన దోమను కొరియర్ చేయాలి : శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్ : ‘దోమలు’ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక జీవులని పేర్కొన్నాడు కెనడియన్ శాస్త్రవేత్త డాన్ పీచ్..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : 'దోమలు' ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక జీవులని పేర్కొన్నాడు కెనడియన్ శాస్త్రవేత్త డాన్ పీచ్. వాతావరణ మార్పుల కారణంగా ఈ కీటకాలు ఎంత దూరం ప్రయాణిస్తున్నాయో తెలుసుకునేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ దోమలు వలస పోతున్నాయని ఇప్పటికే స్పష్టం కాగా.. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు 'చంపిన దోమను కొరియర్ చేయాలి' అని ప్రజలను కోరుతున్నాడు.
యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ప్రకారం ఇన్వాసివ్ టైగర్ రకం గతేడాది నుంచి స్పెయిన్‌లో బలమైన పట్టుసాధించిందని తెలుస్తుండగా.. ఈ రక్తాన్ని పీల్చేసే దోమల వ్యాప్తిని ట్రాక్ చేయడంలో సిటిజన్ సైన్స్ ముఖ్యమైనది. మస్కిటో అలర్ట్ యాప్ అనేది ఏ దోమ తమను కరిచిందో యూరోపియన్లు గుర్తించడానికి, పెద్ద చిత్రాన్ని రూపొందించడంలో సహాయపడటానికి ఉపయోగించే ఒక సాధనం. కాగా 'ఓహ్! నన్ను ఏం కుట్టింది?' అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ వేసవిలో ప్రజలు చంపిన దోమలను కవర్‌లో పెట్టి సెండ్ చేయాలని పిలుపునిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ బ్రిటిష్ కొలంబియా (BC), వాయువ్య యుకాన్ భూభాగానికి పరిమితం చేయబడగా.. BCలో ప్రస్తుతం దాదాపు 50 జాతులు ఉన్నాయని, అయితే పరిశోధన అంతరాలు అంటే వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన దోమ జాతులు ప్రావిన్స్‌లో కనీసం ఇంకా ఆరు ఉండవచ్చని అనుమానిస్తున్నాడు. ఇప్పటివరకు జీవించిన వారిలో దాదాపు సగం మందిని దోమలు చంపేశాయని, ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురుకాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నాడు.
క్లైమేట్ చేంజ్ దోమలను నార్త్‌కు ఎందుకు పంపుతోంది?
గ్లోబల్ వార్మింగ్‌తో సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందునా.. నార్త్‌లోని వెచ్చగా మరియు తేమతో కూడిన పరిస్థితులు గతంలో దోమలను ఆకర్షించే చాలా చల్లగా మరియు పొడిగా ఉండే ప్రాంతాలుగా ఉన్నాయి. బ్రిటీష్ కొలంబియాలో, వాతావరణ మార్పు కారణంగా పర్వత సానువుల్లో మంచు వేగంగా కరుగుతుంది, లోయల దిగువన తరచుగా వరదలను ప్రేరేపిస్తుంది. ఇది ఆడ దోమలు గుడ్లు పెట్టడానికి ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతం దోమల వ్యాప్తితో బ్రిటిష్‌లో ప్రాణాంతక వ్యాధులు స్ప్రెడ్ కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో 40 నుంచి 50 సంవత్సరాలలో వెస్ట్ నైలు వంటి వ్యాధికారకాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫాలిటిస్, జికా మరియు ఎల్లో ఫీవర్ వైరస్‌లకు కారణమయ్యే ఏడెస్ ఈజిప్టి దోమ - 2100 నాటికి తీవ్ర ఉద్గారాల పరిస్థితులలో US, కెనడాలో చాలా వరకు వ్యాపించవచ్చని ఇటీవలి అధ్యయనం కనుగొంది. చనిపోయిన దోమ DNA ఉపయోగకరమైన ఇంటెల్‌ని అందజేస్తుండగా, ఈ కెనడియన్ ప్రాజెక్ట్ సాధారణంగా దోమల వేటకు ఆహ్వానించడం లేదని పేర్కొన్నారు. ప్రమాదకరమైన, బాధించే ఈ చిన్న జీవులు.. పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మొక్కల పరాగ సంపర్కాలు, పక్షులకు ఆహారం మరియు నేలను సుసంపన్నం చేసేవిగా ఉన్నాయన్నారు.
దోమల అధ్యయనంలో కెనడియన్స్ పాత్ర ఏంటి?
బ్రిటిష్ కొలంబియా లేదా యుకాన్‌లో ఉన్నట్లయితే.. చంపేసిన దోమను కాగితం ముక్కలో మడిచి సెండ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని పోస్ట్ చేయడానికి కొన్ని వారాలు పట్టినా సరే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు పీచ్. మరింత వివరణాత్మక డేటాసెట్‌ను రూపొందించడానికి ఏ తేదీన జరిగింది, ఎక్కడ జరిగింది, అక్షాంశం మరియు రేఖాంశాన్ని (గూగుల్ మ్యాప్స్ వంటి యాప్‌లలో సులభంగా శోధించవచ్చు) గమనించి ఆ వివరాలు జతచేయాలని కోరుతున్నాడు. ల్యాబ్ ఆ దోమలను స్వీకరించిన తర్వాత.. ఆ జాతుల నుంచి DNAను సంగ్రహిస్తారని, ఈ సమాచారాన్ని కచ్చితంగా ప్రజలకు ఇమెయిల్ చేస్తామని వాగ్దానం చేశాడు.