ఇది జీర్ణించుకోవడం చాలా కష్టం.. ‘క’మూవీపై టాలీవుడ్ నిర్మాత సెన్సేషనల్ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 31న తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ ఊహించని విధంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 13 కోట్ల గ్రాస్ వసూలు చేసి కిరణ్ అబ్బవరం కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే తమిళ, మలయాళంలో మాత్రం వచ్చే వారం ‘క’(KA) చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, కిరణ్ అబ్బవరం మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము ట్రై చేస్తున్నాము. ‘ సినిమాకు టికెట్స్ దొరకట్లేవని కొందరు బాధపడుతున్నారు. ముఖ్యంగా చెన్నైలో థియేటర్స్ పెంచాలని సార్‌ను అడుగుతున్నాను. 5 లేదా 10 థియేటర్స్ ఇవ్వాలని కోరుతున్నాను. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పెద్ద హిట్ అయ్యాక కూడా సినిమా చూడలేకపోతున్నామని మన తెలుగువారు నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే తెలుగులో షోలు పెంచాలని పదే పదే డైరెక్టర్‌కు ఫోన్ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. బేబీ నిర్మాత SKN ‘X’ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ‘‘మన తెలుగు ఆడియన్స్, మన ఫిలిం ఇండస్ట్రీ అన్ని భాషల సినిమాలను, హీరోలను మన సొంతం అని ఫీల్ అవుతాము. అలా ఫీల్ అవ్వడం పక్కనపెడితే కనీసం మనల్ని అక్కడి వారు పట్టించుకోరు కూడా. ఇది జీర్ణించుకోవడం చాలా కష్టం అయినా అదే నిజం’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.