పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు
దిశ, ములుగు: ములుగు జిల్లా పోలీస్ అధికారుల - The three Maoists surrendered in the presence of Mulugu district police officers
దిశ, ములుగు: ములుగు జిల్లా పోలీస్ అధికారుల సమక్షంలో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయినట్టు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్ తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత CPI మావోయిస్ట్ పార్టీ దళానికి చెందిన ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిపారు.
ఛతీస్‌గఢ్ కు చెందిన కోర్సం సోమ శ్రీ మధు @ సమ్మయ్య(45) S/O హద్మ, దొడి నంద(33) S/O కొయ్య, మడకం గంగ(45) S/o సోమ ఈ ముగ్గురు 151 Bn CRPF అధికారులు Sh. ప్రదుమ్స్ కుమార్ సింగ్ కమాండెంట్, Sh. మైఖేల్ 2IC, Sh. బిష్ణు చరణ్ మునఖియా 2IC వారి సహకారంతో ములుగు జిల్లా పోలీసు అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలిపారు.
ఈ ముగ్గురు మావోయిస్టులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నామని ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నుంచి వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో మావోయిస్టు వీడాలని నిర్ణయించుకుని 151 Bn CRPF, ములుగు జిల్లా పోలీసు అధికారుల ఎదుట తెలిపారు. దళ సభ్యులు లేదా మిలీషియా సభ్యులు ఎవరైనా లొంగిపోయి మెరుగైన జీవితాన్ని గడపడానికి వారి కుటుంబ సభ్యుల ద్వారా లేదా గ్రామ పెద్దల ద్వారా పోలీసు వారిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.