ILEANA : చిన్న వక్షోజాలు, పెద్ద బటక్స్.. బోల్డ్ కామెంట్స్ వినలేక చచ్చిపోతానంటున్న నటి
దిశ, సినిమా: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్నట్లు తెలిపింది.
దిశ, సినిమా: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్నట్లు తెలిపింది. అయితే అలాంటి థాట్స్ రావడానికి బలమైన కారణాలున్నాయన్న ఆమె తన బాడీ పై నీచంగా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటి.. 'ఇటీవల నాకు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివాను. అందులో నా గురించి అనవసరమైన అంశాలు ఎక్కువ రాశారు. అది చదువుతుంటే ప్రాణం తీసేసినట్లు అనిపించింది. నిజానికి నాకు 12 సంవత్సరాల వయస్సు నుంచే కొన్ని అనారోగ్య సమస్యలున్నాయి.
అందుకే బాడీని చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేస్తూ వచ్చాను. కానీ, నిజం ఏంటో తెలుసుకోకుండా అలా రాయడంవల్ల డిప్రెషన్లోకి వెళ్లాను. దీంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా' అంటూ వివరించింది. ఈ క్రమంలోనే అన్నీ సరిగ్గా గుర్తు లేవు కానీ, ఓ నెటిజన్ 'ఓ మై గాడ్ నీ బటక్స్ ఎందుకింత పెద్దగా ఉన్నాయి? వక్షోజాలు ఎందుకలా చిన్నగా ఉన్నాయి? నడుము కరెంట్ తీగ లా ఉంది' అంటూ.. దారుణంగా కామెంట్లు చేశారంటూ భావోద్వేగానికి లోనైంది.