పురుషాంగం చిన్నగా ఉందని ఎగతాళి.. పోలీస్ ఉద్యోగం ఊస్ట్!

దిశ, ఫీచర్స్ : యూకేలోని విల్డ్‌షైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆడమ్ రీడ్స్ అనే పోలీస్ అధికారి తన సహోద్యోగి పురుషాంగ పరిమాణం చిన్నగా ఉందని ఎగతాళి చేసినందుకు ఎటువంటి నోటీసులు లేకుండా..Latest Telugu News

Update: 2022-06-21 06:58 GMT

దిశ, ఫీచర్స్ : యూకేలోని విల్డ్‌షైర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆడమ్ రీడ్స్ అనే పోలీస్ అధికారి తన సహోద్యోగి పురుషాంగ పరిమాణం చిన్నగా ఉందని ఎగతాళి చేసినందుకు ఎటువంటి నోటీసులు లేకుండా ఆ డిపార్ట్‌మెంట్ నుంచి తొలగించబడ్డాడు.

విషయానికొస్తే.. డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా ఎంపికైన వ్యక్తిని టీజ్ చేసే క్రమంలో ఆడమ్ రీడ్స్ అనే ఆఫీసర్ ఉద్దేశపూర్వకంగానే అతని ప్యాంటు విప్పి చేతితో పురుషాంగాన్ని తాకాడు. అంతేకాదు అతని పెనిస్ చిన్నగా ఉందని గట్టిగా అరుస్తూ ఎగతాళి చేశాడు. ఈ విషయమై బాధితుడు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. అయితే తాను ఇదంతా కేవలం ఆటపట్టించేందుకు చేశానని ఆడమ్ వాదించినప్పటికీ చివరకు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఈ ఇష్యూపై స్పందించిన సీనియర్ అధికారి.. 'బాధితుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా చేరాడు. రీడ్స్ అతన్ని బెదిరించేందుకు ప్రయత్నించడమే కాక సహోద్యోగుల ముందు ఎగతాళి చేశాడు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నాం' అని వివరించాడు.

కాగా ఈ సంఘటనకు సంబంధించి తీర్పునిచ్చిన కోర్టు.. 'ఈ రకమైన అనుచిత ప్రవర్తనను సహించలేం. ఇకపై రీడ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసేందుకు అర్హుడు కాడు. అతని వెంటనే విధుల నుంచి తొలగించాలని' అని ఆదేశించింది.


Similar News