యాంటీ-వైరస్ ముసుగులో డేటాచోరి చేస్తున్న యాప్‌లు
దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్...telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. యాంటీ-వైరస్ యాప్‌ల ద్వారా 15,000 మంది ఆండ్రాయిడ్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారని వార్తా సంస్థ IANS తెలిపింది. యాంటీ-మాల్వేర్ యాప్‌లను Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు షార్క్‌బాట్ ఆండ్రాయిడ్ మాల్వేర్ ద్వారా, వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఇతర కీలకమైన సమాచారం దొంగలించడం జరిగింది. యాంటీ-వైరస్ యాప్‌లు రక్షించడానికి బదులుగా కీలకమైన డేటాను చోరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి 6 యాంటీ-వైరస్ యాప్‌లను Google Play Store లో గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఇటలీ, బ్రిటన్‌కు చెందిన వారు. ఇది అరుదుగా ఉపయోగించే డొమైన్ జనరేషన్ అల్గారిథమ్ (DGA) అనే అంశాన్ని ఉపయోగించుకొని డేటాను చోరి చేస్తుంది. గూగుల్ ఈ యాప్‌లను పరిశీలించిన తర్వాత, Google Play స్టోర్‌లో ఈ అప్లికేషన్‌లను శాశ్వతంగా తీసివేయడం ప్రారంభించింది.