దిశ, ఝరాసంగం : రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ రైతులకు సూచించారు. మండల పరిధిలోని ఏడాకులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్వింటాలుకు రూ. 5,230లు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రతి ఎకరానికి 6 క్వింటాళ్ల శనగలు అమ్ముకోవచ్చని అన్నారు. రోజుకు 25 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి, రైతు సంఘం చైర్మన్ ప్రభు పాటిల్, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.