భార్య తలతో 12 కిలోమీటర్లు నడిచిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పెళ్లితో దంపతులు అవుతున్నారు తప్ప అర్ధం చేసుకునే మనస్తత్వం లేకుండా పోతుంది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పెళ్లితో దంపతులు అవుతున్నారు తప్ప అర్ధం చేసుకునే మనస్తత్వం లేకుండా పోతుంది. సమాజంలో చాలా మందిలో అనుమానం పెను భూతంలా మారింది. అనుమానంతో ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా వెనకాడటం లేదు. చిన్న చిన్న గొడవలకు కోపోద్రిక్తులై ఘోరానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే గోండియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. నకఫోడి మఝీ అలియాస్ జాందా తన భార్యపై అనుమానంతో అమెను దారుణంగా హత్య చేశాడు. తరచూ వారిమధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. అయితే జూలై 15న మళ్లీ గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన జాందా దారుణంగా పదునైన కత్తితో భార్య తలను నరికేశాడు. మరుసటి రోజు ఉదయమే భార్య తలతో 12కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. జాందాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతామంతా భయంతో వణికిపోతున్నారు.