Pragathi: ఆ స్టార్ నటుడు నాతో ఆ రోజు అసభ్యంగా ప్రవర్తించాడు.. నటి ప్రగతి ఎమోషనల్ కామెంట్స్
నటి ప్రగతి(Pragathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్(character artist)గా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నది.
దిశ, సినిమా: నటి ప్రగతి(Pragathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్(character artist)గా ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మోప్పిస్తున్న ఈమె.. అప్పట్లో హీరోయిన్‌గా కూడా నటించి మెప్పించింది. టీనేజ్‌లో ఉన్న టైంలో రెండు, మూడు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక కెరీర్ పరంగా హీరోయిన్‌గా సెటిల్ అవుద్దీ అనుకునే లోపే పెళ్లితో హీరోయిన్‌గా ఆమె కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడింది. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం తన సినీ జర్నీ మళ్లీ మొదలు పెట్టి సక్సెస్ అయింది. ఇలా చాలా సినిమాల్లో ప్రగతి.. అమ్మగా, అత్తగా, ఆంటీగా నటించి మెప్పించింది. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటోంది. ప్రస్తుతం ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి.. అక్కడ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. "ఓ నటుడు నాతో ఓ రోజు సెట్లో ఉన్నట్టుండి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతను చేసిన పనికి నేను షాక్ అయ్యాను. అసలు ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కానీ, ఆ నటుడు నాతో మొదట్లో చాలా పద్దతిగా ఉండేవాడు. అయితే అప్పుడు ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. దాంతో నేను చాలా బాధపడ్డాను. ఆ బాధతో భోజనం కూడా చేయాలనిపించలేదు.
ఆ రోజు షూటింగ్ కూడా చేయలేకపోయాను. ఆ తర్వాత అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. క్యారావ్యాన్ లోకి వెళ్లి ఆయనతో మాట్లాడాను. నాతో ఎందుకు అలా ప్రవర్తించారు అని అడిగాను. దీంతో ఆయన నీళ్లు మింగాడు. నేను తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండేదని, ఒక్కసారి అయినా ఆలోచించారా?’ అని ప్రశ్నించాను. దాంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తనకు పొగరు ఎక్కువ. యాటిట్యూడ్ ఎక్కువ అని నన్ను బ్యాడ్ చేశాడని నాకు తెలిసింది” అని ప్రగతి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఆ నటుడి నేమ్ మాత్రం రివీల్ చేయకపోవడం గమనార్హం.