ప్రాణాలు తీస్తున్న జేబ్రాండ్లు: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్
దిశ, ఏపీ బ్యూరో: జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలు, ఏలూరు ఆసుపత్రిలో - TDP MLC Nara Lokesh comments on ys jagan
దిశ, ఏపీ బ్యూరో: జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలు, ఏలూరు ఆసుపత్రిలో జేబ్రాండ్ తాగి చనిపోయినవారే కాకుండా,దశలవారీ మద్యపాననిషేధంపై ప్రభుత్వ రోడ్ మ్యాప్ ఏమిటో.. ముఖ్యమంత్రి వైఖరేమిటో కూడా తేలాలి అని టీడీపీ శాసన మండలి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం సభల్లో తమకు సమాధానంచెప్పలేక నాటుసారా మద్యం అంశాలనుంచి పారిపోయింది. 28మంది చనిపోయారని అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నా.. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది.
జంగారెడ్డిగూడెం మరణాలపై తాము 4గంటలపాటు సభలో నిలబడి నిరసన వ్యక్తం చేస్తే, మంత్రులు అవహేళనగా నవ్వుకుంటున్నారని టీడీపీ తెలిపింది. ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఇప్పుడు తప్పించుకున్నా.. జే-బ్రాండ్లు , నాటుసారా, ఇతర మాదకద్రవ్యాలతో రాష్ట్రవ్యాప్తంగా మరణించినవారు, నష్టపోయిన వారికి న్యాయం జరిగేవరకు టీడీపీ ఊరుకోదు అని టీడీపీ శాసన మండలి సభ్యులు హెచ్చరించారు.
ప్రివిలేజ్ మోషన్‌పై ఎందుకు చర్చించరు.. నారా లోకేశ్
'నాటు సారా మరణాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేశారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ఈ అంశాన్ని వాయిదా తీర్మానంలో పెట్టి ఇచ్చామన్నారు. దానిపై కూడా చర్చించలేక, ముఖ్యమంత్రి అక్కడ చెబితే ఇక్కడెలా మాట్లాడాతారని వైసీపీవారు అంటున్నారు. ముఖ్యమంత్రి సారా మరణాలు సహజ మరణాలని చెప్పిన విషయం ప్రసారమాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచురితమైంది.. ప్రసారమైంది.
నిండు సభలో అవాస్తవాలు చెప్పడం 5 కోట్లఆంధ్రులను తప్పుదారి పట్టించడమే. అందువల్లే మేము ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇస్తే దానిపై చర్చించకుండా, ప్రశ్నించిన మాపై చర్యలెలా తీసుకుంటారు?'అని నారా లోకేశ్ ప్రశ్నించారు. 'బుధవారం మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌లో ఏదో తప్పుఉందంటూ నేడు మాపై వైసీపీవారు ప్రి విలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు. ఏసభకైనా 5కోట్లమంది ఆంధ్రులకైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేకదా! జగన్మోహన్ రెడ్డి చెప్పిన రత్నాల్లో ఒకరత్నం మద్యపాననిషేధం.
కానీ అదే మద్యం అమ్మకాలతోనే జగన్ రెడ్డి తనప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. మద్యంపై వచ్చేఆదాయాన్ని రూ.24వేలకోట్లకు పెంచుకున్నాడు. అదేనా ముఖ్యమంత్రి చెప్పిన మద్యపాన నిషేధం. మద్యం, సారా, ఇతరత్రా మాదక ద్రవ్యాల అంశాలపై తాముగ్రామస్థాయి నుంచి పోరాటంచేయాలని నిర్ణయించాము' అని ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పష్టం చేశారు.