తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన
దిశ, నిజామాబాద్ రూరల్: డిచ్ పల్లి మండల కేంద్రంలో ఉన్న - students have expressed concern over a frog in breakfast at a womens hostel at telangana university
దిశ, నిజామాబాద్ రూరల్: డిచ్ పల్లి మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో టిఫిన్‌లో కప్ప రావడం చాలా దారుణమని పీడీఎస్‌యూ యూనివర్సిటీ అధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు బుధవారం హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని యూనివర్శిటీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆయన అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. టిఫిన్ లో కప్ప రావటం జారిందని, ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా 450 మంది విద్యార్థులకు ఒకే గర్ల్స్ హాస్టల్ సరిపోవడం లేదని అదనంగా మరొక గర్ల్స్ హాస్టల్ ను నిర్మించాలని కోరారు. రోజువారీగా కోతులు, పాములు హాస్టల్ లో సంచరిస్తున్నాయని వీటివలన క్లాసులకి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. హాస్టల్స్ లో అదనంగా వేయిటర్స్ ను నియమించాలని, వాటర్, వైఫై సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ తులసి, పీడీఎస్ యూ యూనివర్సిటీ కార్యదర్శి సంతోష్, విద్యార్థులు సతీష్, సంకీర్తన, మల్లిక, అర్బాస్, నందిని, మౌనిక 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.