Anchor : ఆస్పత్రిలో దీన స్థితిలో స్టార్ యాంకర్.. 40 రోజులుగా నరకయాతన

ఒకరోజు ఉదయం 6.45 గంటల నుంచి తర్వాతి రోజు ఎర్లీ మార్నింగ్ 2.45 గంటల వరకూ కంటిన్యూగా షూట్ చేశానని, ఫలితంగా ఆస్పత్రి పాలయ్యానని చెప్పుకొచ్చింది. ఎవరూ నాలాగా గంటల తరబడి పనిచేయొద్దని, ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Update: 2024-11-17 05:55 GMT

దిశ, వెబ్ డెస్క్: నటీనటులను తెరపై చూసి.. అబ్బా వీళ్లకేంటి.. బోల్డంత డబ్బు, కావలసిన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారనుకుంటాం. కానీ తెరవెనుక వాళ్లు పడే కష్టం ఎవ్వరికీ కనిపించదు. షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ కారణంగా చాలా మంది రెస్ట్ లేకుండా పనిచేస్తుంటారు. అలా దాదాపు 20 గంటలు రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొన్న ఓ స్టార్ యాంకర్ ఇప్పుడు ఆస్పత్రిలో బెడ్ పై ఉంది. తన పరిస్థితిని వివరిస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేయగా.. అది వైరల్ అవుతోంది.

టీవీ షోలు, స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీ బిజీగా ఉండే ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu) ఇప్పుడు ఆస్పత్రిలో ఉంది. 40 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నానంటూ ఎమోషనల్ అయింది. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ఇలాంటి పోస్టు పెడతానని, పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదని, ఇప్పుడు పెట్టక తప్పడం లేదని వాపోయింది.

ఒకరోజు ఉదయం 6.45 గంటల నుంచి తర్వాతి రోజు ఎర్లీ మార్నింగ్ 2.45 గంటల వరకూ కంటిన్యూగా షూట్ చేశానని, ఫలితంగా ఆస్పత్రి పాలయ్యానని చెప్పుకొచ్చింది. ఎవరూ నాలాగా గంటల తరబడి పనిచేయొద్దని, ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది స్రవంతి. ఈ పోస్ట్ స్పెషల్ గా ఆడవారి కోసమే పెడుతున్నానని పేర్కొంది. 40రోజులుగా ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్ అవుతోందని, డాక్టర్ ని కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేయించుకోలేదని పేర్కొంది. కంటిన్యూగా షూటింగ్ తర్వాత విపరీతంగా కడుపునొప్పి రావడంతో డాక్టర్ ను కలిశానని, ఆ తర్వాత అది చిన్న సమస్య కాదని తెలిసి ఆస్పత్రిలో అడ్మిట్ అయి.. సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ముందులాగా నడవాలంటే 4-5 వారాల సమయం పడుతుందని డాక్టర్ చెప్పారని ఆ పోస్ట్ లో స్రవంతి చెప్పుకొచ్చింది. అయితే ఆ పోస్ట్, ఫొటోలను స్రవంతి డిలీట్ చేయడంతో.. వీడియో నెట్టింట కనిపించడం లేదు. 





 


 


Tags:    

Similar News