Budget Smartphones: బెస్ట్ ఫీచర్స్‌తో కేవలం రూ.6 వేలకే స్మార్ట్ ఫోన్లు..!
ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్స్‌తో స్మార్ట్ మొబైల్ కొనాలనుకునేవారికి శుభవార్త.
దిశ, వెబ్‌డెస్క్: ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్స్‌తో స్మార్ట్ మొబైల్(Smartphones) కొనాలనుకునేవారికి శుభవార్త. కేవల 6 వేల రూపాయల లోపే స్మార్ట్ ఫోన్ మీ సొంతమవుతుంది. అమెజాన్ ఇండియా(Amazon India), ఫ్లిప్ కార్టు(Flipkart)లలో రూ. 6 వేలల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రాసెసర్(Processor), క్లాస్ కెమెరా(Class camera), డిస్ ప్లే(Display)తో మంచి ఫీచర్లు కూడా లభిస్తాయి. వీటితో పాటు ఉత్తమమైన బ్యాటరీ(Battery) కూడా కంపెనీ అందిస్తుంది. మరీ తక్కువ ధరకు మంచి ఫీచర్లతో వచ్చే మొబైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) స్మార్ట్ మొబైల్ కేవలం రూ.6, 699 రూపాయలకే మీ సొంతమవుతుంది. బ్యాంక్ ఆఫర్ తో అయితే ఈ స్మార్ట్ మొబైల్ రూ. 6000 లకు రానుంది. 3 జీబీ ర్యామ్()3 GB RAM, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(64 GB internal storage)తో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ధర ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. ఈ మొబైల్ లో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే(HD Plus Display) అందిస్తున్నారు. రెండు కెమెరాలు వస్తున్నాయి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 వెనక భాగంలో ఫొటోగ్రఫీ(photography) కోసం ఎల్‌ఈడీ ఫ్లాష్(LED flash) తో రానున్నాయి. మెయిన్ కెమెరా కెపాసిటీ(Camera capacity) అయితే 3 మెగాపిక్సెల్స్ ఉండనుంది. ఏఐ లెన్స్(AI Lens) కూడా వస్తుంది.
ఐటెల్ ఆరా 05ఐ
ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీనికి యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కూడా లభిస్తుంది. ఐదు మెగా పిక్సెల్ కెమెరా రానుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ అందిస్తోంది. హెచ్‌డీ డిస్‌ప్లే 6.6 అంగుళాలు ఉంటుంది. ఈ మొబైల్ రూ. 5749 ధరకు లభిస్తుంది.
రెడ్‌మీ ఏ2....
రెడ్‌మీ ఏ2 ఫోన్(Redmi A2 phone) 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ తో రానుంది. అలాగే 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో కేవలం రూ. 5669 తో అతితక్కువ ధరకు లభిస్తోంది. రెడ్‌మీకి చెందిన ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రెడ్‌మీ ఏ2 ప్రైస్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.