మందుకు పైసలియ్యలేదని…స్మగ్లింగ్ కర్రను పట్టించాడు
ఓ వ్యక్తి మద్యం తాగడానికి రూ. 200 అడిగితే ఇవ్వలేదని, 100కు డయల్ చేసి అక్రమ కలప లారీని పట్టించారు. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది.
దిశ, తాండూరు : ఓ వ్యక్తి మద్యం తాగడానికి రూ. 200 అడిగితే ఇవ్వలేదని, 100కు డయల్ చేసి అక్రమ కలప లారీని పట్టించారు. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఆదివారం ఉదయం గ్రామ శివారులో అక్రమ కలప లారీ లోడ్ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన హస్సేన్ అనే వ్యక్తి మద్యం తాగడానికి రూ.200 ఇవ్వలేదని, లారీ డ్రైవర్ తో గొడవపడ్డాడు.ఇవ్వకపోవడంతో 100కు డయల్ చేసిన హస్సేన్.లారీని అడ్డుకొని..100 కు డయల్ చేశాడు.వెంటనే బషీరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమ కలప లారీని బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ప్రభుత్వం వాన మహోత్సవ పేరుతో మొక్కలు నాటుతుంటే అక్రమ కలప వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు.