లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం 57 స్థానాల్లో 55.79శాతం ఓటింగ్ నమోదైంది. క్రితం సారి తో పోలిస్తే కాస్త తక్కువే నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు 10 జిల్లాల్లో మొత్తం 55.79 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సీఎం యోగీ ఆధిత్యనాథ్ గోరఖ్‌నాథ్ కన్యానగర్ క్షేత్రలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని కపిల్ వాస్తులో ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ డిమాండ్లు నెరవేరకపోవడంతో అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. గురువారం జరిగిన ఐదవ దశ పోలింగ్‌లో ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని హండియా విధానసభ నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. 10 జిల్లాలోని 57 స్థానాల్లో 676 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక చివరి దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. వీటి ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.