బాత్‌రూమ్ సెల్ఫీతో స్టార్ హీరో భార్య.. ఆగలేవా! అంటూ ట్రోలింగ్
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో షాహిద్ కపూర్- మీరా రాజ్‌పుత్ ముందు వరుసలో ఉంటారు..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో షాహిద్ కపూర్- మీరా రాజ్‌పుత్ ముందు వరుసలో ఉంటారు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఈ జంట ఒకరికొకరు ప్రేమను చాటుకుంటూ ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక నెట్టింట యాక్టివ్‌గా ఉండే మీరా.. తాజాగా బాత్‌రూమ్ సెల్ఫీతో దర్శనమిచ్చి ట్రోలింగ్‌కు గురైంది. అయితే ఈ ట్రోలింగ్ మొదలుపెట్టింది షాహిద్ కావడం విశేషం. విషయానికొస్తే.. 'నా పనిలో నైపుణ్యాలను చాటుకుంటున్నా.
కోరుకున్న రూపాన్ని సాధించగలిగినందుకు గర్వంగా ఉంది' అంటూ మీరా తాను బాత్‌రూమ్‌లో మేకప్ వేసుకుంటున్న సెల్ఫీని నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో వెంటనే రెస్పాండ్ అయిన షాహిద్.. 'ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చేవరకు కూడా మేకప్ ఫేస్‌ను ఫొటో తీయకుండా ఉండలేకపోయింది' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా '200 శాతం నిజం చెప్పారు' అంటూ నెటిజన్లు రిప్లయ్ ఇస్తున్నారు.