Nupur Sharma: ఆ కేసులన్నీ ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయండి.. ఆదేశాలిచ్చిన సుప్రీం

Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi| గత కొంతకాలంగా బీజేపీ నేత నుపూర్ శర్మ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నుపూర్ శర్మ వార్తల్లోకెక్కారు. దాంతో ఆమె వ్యాఖ్యలపై దేశంలోని ముస్లింలు మండిపడుతున్నారు

Update: 2022-08-10 11:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: Supreme Court Seeking to Transfer All Cases Against Nupur Sharma to Delhi| గత కొంతకాలంగా బీజేపీ నేత నుపూర్ శర్మ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నుపూర్ శర్మ వార్తల్లోకెక్కారు. దాంతో ఆమె వ్యాఖ్యలపై దేశంలోని ముస్లింలు మండిపడుతున్నారు. ఆమెపై అనేక కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా నుపూర్ శర్మకు వ్యతిరేకంగా ఎన్నో కేసులను నమోదయ్యాయి. ఆమె వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఆమెకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా నుపూర్ శర్మ కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో నుపూర్ శర్మపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది.

సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయంతో సస్పెండెడ్ బీజేపీ నేత నుపూర్ శర్మకు రిలీఫ్ లభించినట్లు ఉంది. అయితే తన వ్యాఖ్యలపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఒకే చేటకు తీసుకురావాలని నుపూర్ అనేక సార్లు కోరారు. కానీ ఆమె డిమాండ్‌ను బెంగాళ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ తాజాగా సుప్రీంకోర్టు నుపూర్ శర్మ కోరిన ప్రకారం ఆమెపై ప్రవక్త విషయంలో నమోదైన అన్ని కేసులను ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: త్వరలో కేసీఆర్ బీహార్ టూర్? పీకే వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా?

Tags:    

Similar News