Samyukta: డిఫరెంట్ జానర్‌లో సంయుక్త థ్రిల్లర్ మూవీ.. క్లాప్ కొట్టి స్టార్ట్ చేసిన స్టార్ హీరో

వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సంయుక్త.. తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు.

Update: 2024-10-09 10:15 GMT

దిశ, సినిమా: వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సంయుక్త.. తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహిస్తున్నాడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6ని నిర్మిస్తుండగా.. సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. వెంకీ కుడుముల, కోన వెంకట్ మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. రానా దగ్గుబాటి క్లాప్‌కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, జెమినీ కిరణ్, సాహు గారపాటి, చుక్కపల్లి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘అందరికీ థాంక్యూ.. నిజంగా ఈ సినిమా ఒక మిరాకిల్‌లానే జరిగింది. రెండ్రోజుల క్రితం కథ విన్నాను. డైరెక్టర్ కొన్ని ఇయర్స్‌గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. ఫిమేల్ సెంట్రిక్ అనగానే టూ మచ్ థ్రిల్లర్ లేదా ఎంపార్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఈ స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు ఉన్నాయి. నెగిటివిటీ తగ్గించాలనుకున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ మ్యాన్ పవర్, ఫిజికాలిటీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది కథ’ అని తెలిపారు. కాగా.. భై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ థ్రిల్లర్ జానర్‌లో కొత్త పాయింట్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దర్శకుడు సంయుక్తను డైనమిక్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త కొన్ని బ్రెత్ టేకింగ్ స్టంట్స్‌ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్. 

Tags:    

Similar News