వాళ్ల‌ను 25 రోజులు బంధించిన ర‌ష్యా సేన‌.. 9 మందికి గ‌ర్భం! (వీడియో)

అస‌హ్య‌మైన ఆలోచ‌నే దీని వెనుక కార‌ణ‌మ‌ని... Russian Soldiers Kept Ukrainian Women In Basement For 25 Days.

Update: 2022-04-13 09:37 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః సామ్రాజ్యకాంక్ష అధికారానిది, యుద్ధం రాజ‌కీయానిది, న‌ష్టం మాత్రం సామాన్య మ‌నిషిది! ప్ర‌ప‌మంచ‌మంతా అవ‌ధుల్లేని నాగ‌రిక‌త, అంత‌కుమించిన సాంకేతిక‌త అభివృద్ది చెందింది. అయినా, మాన‌వుడిలో మృగ‌తృష్ణ మాత్రం చ‌ల్లార‌లేదు. చ‌రిత్ర‌లో ఏ దాడి చూసుకున్నా అది ఆడ‌వాళ్ల‌నే బ‌లితీసుకుంటుంది ఎందుకో..?! ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిలో కూడా ఇదే కొన‌సాగింది. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని కీవ్ న‌గ‌రం నుండి వైదొలిగార‌ని అంతా అనుకున్నారు. కానీ, అక్క‌డి ప్రజలు అనుభవించిన క‌ర్క‌శ గుర్తులు శాశ్వతంగా ఉండిపోయాయి. వార్‌క్రైమ్స్‌ పరిశోధకులు కొంద‌రు రష్యా సైనికులు చేసిన నేరాలకు సంబంధించి భయంకరమైన నిజాల‌ను వెల్లడించారు.

వెలికితీసిన ఆధారాల‌ను బ‌ట్టి, ర‌ష్యా సైనికులు కొంద‌రు ఉక్రేనియన్ మహిళల్ని, బాలికలను 25 రోజుల పాటు బుచా ప్రాంతంలోని ఓ ఇంటి అండ‌ర్‌గ్రౌండ్ బేస్‌మెంట్లో ఉంచారు. వారిపై అత్యాచారం చేసిన ర‌ష్యా బ‌ల‌గాలు చిన్నపిల్ల‌ల్ని సైతం వ‌దిలిపెట్ట‌లేదు. మానవ హక్కులపై ప‌నిచేసే ఉక్రెయిన్ అధికారిక ప్ర‌తినిధి, లియుడ్మిలా డెనిసోవా, తెలియ‌జేసిన వివ‌రాల‌ను ప్ర‌కారం ఆ బంధీల్లో ప్ర‌స్తుతం తొమ్మిది మంది గర్భవతుల‌ని ధృవీకరించారు. అయితే, ఉక్రెయిన్ మ‌హిళ‌ల‌కు ర‌ష్య‌న్ పురుషుల నుండి పిల్ల‌లు పుట్టాల‌నే అస‌హ్య‌మైన ఆలోచ‌నే దీని వెనుక కార‌ణ‌మ‌ని ప‌రిశీల‌కులు వెల్ల‌డించారు.

రష్యా దళాలు చేసిన అత్యాచారం, చిత్రహింసలకు సంబంధించిన అనేక కేసుల వివరాలను పంచుకున్న‌ డెనిసోవా, బుచా, కైవ్ వెలుపలి ప్రాంతాలు, అనేక ఇతర ఉక్రేనియన్ పట్టణాలు ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఇక‌, ఈ బుచా బేస్‌మెంట్‌ బాధితుల్లో దాదాపు 25 మంది బాలికలు, 14 నుండి 24 సంవత్సరాల వయస్సు గల మహిళలు అత్యాచారానికి గురయ్యారని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, గర్భవతిని చేశార‌ని ప‌రిశోధ‌న‌లో తెలిసింది. కాగా, 11 ఏళ్ల బాలుడిని తన తల్లి ఎదుటే కుర్చీకి కట్టేసి అత్యాచారానికి పాల్పడిన‌ట్లు తెలిసింది. ఇక‌, 70 ఏళ్ల ఓ వృద్ధురాల్ని రేప్ చేసి, త‌న భ‌ర్త‌ను కాల్చి చంపిన‌ట్లు తెలిసింది. దీనికి సంబంధించి బిబిసి చేసిన ఇంట‌ర్వ్యూ ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 


Similar News