చమురు, గ్యాస్ రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టాలి: రష్యా
దిశ, వెబ్‌డెస్క్: చమురు, గ్యాస్ రంగంలో తన పెట్టుబడులను మరింతగా పెంచాలని రష్యా భారతదేశాన్ని కోరింది. ఉక్రెయిన్‌పై రష్యా.. Latest Telugu News..
దిశ, వెబ్‌డెస్క్: చమురు, గ్యాస్ రంగంలో తన పెట్టుబడులను మరింతగా పెంచాలని రష్యా భారతదేశాన్ని కోరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించడంతో, రష్యా ఆర్థిక వ్యవస్థ 1991 సోవియట్ యూనియన్ పతనం తర్వాత మళ్లీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత్‌లో రష్యన్ కంపెనీల విక్రయాల నెట్‌వర్క్‌లను విస్తరించేందుకు రష్యా ఆసక్తిగా ఉంది. "భారత్‌కు రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు $1 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్యను పెంచడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి" అని రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ ప్రభుత్వ రంగ కంపెనీలు రష్యన్ చమురు, గ్యాస్ క్షేత్రాలలో వాటాలను కలిగి ఉండగా, రోస్‌నెఫ్ట్‌తో సహా రష్యన్ సంస్థలు భారతీయ రిఫైనర్ నయారా ఎనర్జీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి.