Hyderabad News: సీతారాముల కల్యాణానికి RTC స్పెషల్ బస్సులు
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం
దిశ,డైనమిక్ బ్యూరో :దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా భక్తులు లేకుండానే కల్యాణం నిర్వహించారు. అయితే, ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో స్వామివారి కల్యాణాన్ని లక్షలాది భక్తుల నడుమ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ నుంచి భద్రాచలానికి 70 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇవి ఎంజీబీఎస్‌తో పాటు ఎల్‌బీనగర్ ముఖ్య కూడళ్ల నుంచి అందుబాటుల్లో ఉండనున్నాయి. భద్రాచలం వెళ్లే ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు అని ఒకవేళ రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు పెంచుతామని అధికారులు తెలిపారు. భక్తులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీస్ఆర్టీసీ అధికారులు కోరారు.