దానికే క‌ట్టుబ‌డి ఉంటా.. పొలిటిక‌ల్ ఎంట్రీపై JR.NTR క్లారిటీ

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించింది.

Update: 2022-04-01 02:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. RRR మూవీ విజయం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు నీరాజనం పడుతున్నారు. ఎన్టీఆర్ 20 ఏళ్ల కెరీర్‌లో RRR చిత్రం ఓ మైలురాయిగా నిలిచిందని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా 'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తారక్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం నటుడిగా తన జీవితం సంతోషంగా ఉందని, యాక్టర్‌గా తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని అన్నారు. మరు క్షణంలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు, భవిష్యత్తు రాజకీయాలను ఎలా అంచనా వేయగలమని తెలిపారు.

ప్రస్తుతం రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించే సమయం లేదని స్పష్టం చేశారు. తన జీవితానికి తాతగారు(నందమూరి తారకరామారావు) స్ఫూర్తి అని వ్యాఖ్యానించించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు తీర్చుకొలేని విధంగా ప్రేమను పంచారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజలకు తనకు తాను ఏదో తిరిగి ఇవ్వాలని అనుకున్నారు. ఆయన జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ప్రజలకు తిరిగి ఇవ్వాలనే కోరిక తనను వెంటాడుతుంటుందని అభిప్రాయపడ్డారు. తాతగారి లాగే నాకూ అభిమానులు ఎంతో ఇస్తున్నారు. వారికీ తన ప్రేమను పంచాల్సిన బాధ్యత తనపై ఉందని, అభిమానులను సంతోషంగా ఉంచాలని ఆ మహానటుడి నుంచే నేర్చుకున్నానని అన్నారు. ప్రస్తుతం తాను సినిమా రంగంలోనే ఉంటానని తారక్ గట్టిగా చెప్పడంతో, ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే అనేది స్పష్టం అయ్యింది.

Tags:    

Similar News