అప్పటి నుంచే కుట్రలు.. సంచలన విషయాలు బయటపెట్టిన Uddhav Thackeray
Revolt Planned When He was Hospitalized Says Uddhav Thackeray| తన ప్రభుత్వం కూలిపోవడానికి తాను ఆసుపత్రిలో ఉన్ననాటి నుండే కుట్రలు జరిగాయని శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోల్పోయిన తర్వాత మొదటి సారి
దిశ, వెబ్‌డెస్క్: Revolt Planned When He was Hospitalized Says Uddhav Thackeray| తన ప్రభుత్వం కూలిపోవడానికి తాను ఆసుపత్రిలో ఉన్ననాటి నుండే కుట్రలు జరిగాయని శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోల్పోయిన తర్వాత మొదటి సారి శివసేన పార్టీ అధికార పత్రిక 'సామ్నా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఠాక్రే సెన్సేషన్ కామెంట్స్ చేశారు. తాను గతంలో ఆస్పత్రిలో కదల్లేని స్థితిలో ఉండగా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రణాళికలు చురుకుగా జరిగాయని ఆరోపించారు. ఓ వైపు ఆస్పత్రిలో తాను ఉంటే.. మరోవైపు పన్నాగాలు, కుట్రలతో ప్రత్యర్థులు చురుగ్గా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను ఏక్ నాథ్ షిండేను సీఎంని చేసి ఉన్నా.. అతడి ఆలోచనలు దుర్మార్గమైనవిగానే ఉండేవని షిండేపై విరుచుకుపడ్డారు. కుళ్లిపోయిన ఆకులు చెట్టు నుండి ఎప్పటికైనా రాలిపోవాల్సిందేనని, ఏక్ నాథ్ షిండే వర్గం కూడా అలానే వెళ్లిపోయారని దుయ్యబట్టారు. వాళ్లను నమ్మడమే తాను చేసిన పొరపాటని అన్నారు. తమ వద్ద నుండి లబ్ది పొందిన వారే తిరిగి తమపై తిరుగుబాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగుబాటు చేసినంత మాత్రాన పార్టీలో నాయకులకు కొదువ లేదని, సామాన్యులే తమ బలం అని చెప్పుకొచ్చారు. సామాన్యుల నుండి అసాధారణ నేతలను తయారు చేసుకోగల సత్తా ఉందని చెప్పారు.
మరోవైపు బీజేపీ తీరుపై ఉద్దవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019లో తమ డిమాండ్లకు అంగీకారం చెబితే అది ఇరువురికి గౌరవంగా ఉండేది కదా అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది.. శివసేన నుండి గెలుపొందిన వ్యక్తినే సీఎం అయ్యారు. ఇదే షరతుకు నాడు ఓకే చెప్పి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా? అని ప్రశ్నించారు. తన ప్రభుత్వం కూలిపోవడానికి ఢిల్లీ వెన్నుపోటు కారణం అని ఫైర్ అయ్యారు. హిందుత్వంలో మరో భాగస్వామి ఉండకుండా కొందరు కుట్ర చేస్తున్నారని, హిందువుల మధ్య ఐక్యతను దెబ్బ కొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రెబల్ నేతలు తన తండ్రి బాల్ ఠాక్రే పేరున ఉపయోగించకుండా గెలుపొందాలని సూచించారు.
ఇది కూడా చదవండి: కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవు.. లోక్‌సభలో కేంద్రమంత్రి