ప్రకృతి అద్భుతం.. గాలిలో తెలుతూ వెనక్కి వెళ్లిన వాటర్ ఫాల్! (వీడియో)
ఈ వీడియోను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయామని అన్నారు. Reverse waterfall in Maharashtra's Naneghat.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రకృతిలో కనిపించే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఆ అందాలకు మైమరచి, ఆస్వాదించడం తప్ప వాటిని మాటల్లో చెప్పడం కష్టమే. అప్రయత్నంగా ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగిన ఈ ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో జలపాతం నుండి నీరు కిందికి ప్రవహించకుండా రివర్స్‌లో పైకి వెళుతుంది. నీరు ఆవిరైపోతూ మేఘాల్ని ఏర్పరుస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ఈ అద్భుతమైన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
గురుత్వాకర్షణ, గాలి ఒకదానికొకటి సమాన సామార్థ్యం కలిగి ఉంటే సంభవించే అద్భుత దృశ్యం ఇది అని ఐఎఫ్ఎస్ అధికారి నందా వివరించారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల శ్రేణిలో ఉన్న నానేఘాట్ జలపాతంలో అత్యంత సుందరమైన ఈ దృశ్యం వర్షాకాలంలో కనిపిస్తుంది. అందరూ దీన్ని 'బ్యూటీ ఆఫ్ మాన్సూన్స్' అని అంటారు. ఈ వైరల్ వీడియోక లక్షల్లో వీక్షణలు, పదుల వేలు లైక్‌లు వస్తున్నాయి. చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వీడియోను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయామని అన్నారు. మీరూ చూడండి.
When the magnitude of wind speed is equal & opposite to the force of gravity. The water fall at its best during that stage in Naneghat of western ghats range.
— Susanta Nanda IFS (@susantananda3) July 10, 2022
Beauty of Monsoons. pic.twitter.com/lkMfR9uS3R