మరోసారి మోసం చేయడానికే కేసీఆర్ ఉద్యోగ ఖాళీల ప్రకటన: రేవంత్​రెడ్డి

దిశ, అల్వాల్: ఉద్యోగ కల్పన విషయంలో మరోసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికే..Revanthreddy hits out at CM KCR over jobs announcement

Update: 2022-03-09 16:37 GMT

దిశ, అల్వాల్: ఉద్యోగ కల్పన విషయంలో మరోసారి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్​ఉద్యోగ ఖాళీల ప్రకటన చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. బుధవారం ఓల్డ్ అల్వాల్​పీవీఆర్​గార్డెన్​లో జరిగిన డిజిటల్​సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. మల్కాజిగిరి నియోజకర్గంలో 379 బూతులు ఉన్నాయని అందులో 47 వేల 315 డిజిటల్​సభ్యత్వాలు వెరిఫైడ్​చేయగా మరో 4500 సభ్యత్వాలు చిన్నకారణాలతో పక్కన పెట్టడడం జరిగిందని, త్వరలోనే వాటిని సవరించి లెక్కలోకి తీసుకుంటామని తెలిపారు. 30 లక్షల సభ్యత్వాలు చేస్తామని సోనియాగాంధీకి చెప్పాం.. కార్యకర్తల కృషి ఫలితంగా 45 లక్షల సభ్యత్వాలు చేయగలిగామని.. మరో ఐదు లక్షలు చేసి 50 లక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.

కష్టపడిన కార్యకర్తలను గుర్తిస్తాం..

బూత్​లేవల్ లో కష్టపడి సభ్యత్వ నమోదు చేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందన్నారు. వారు చెప్పిన వారికే సంక్షేమ ఫలాలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రూ. 2 లక్షల ప్రమాద భీమా ఉంటుందన్నారు. ఒక ఇంట్లో ఐదుగురు కాంగ్రెస్​సభ్యత్వం తీసుకుంటే రూ. 10 లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందన్నారు.

90 సీట్లతో తెలంగాణలో సోనియమ్మ రాజ్యం..

50 లక్షల సైన్యం 80 లక్షల ఓట్లు తెస్తారు.. దానితో 90 సీట్లు సాధించి తెలంగాణలో రానున్న 12 నెలలో సోనియమ్మ రాజ్యం సాధిస్తామని రేవంత్​రెడ్డి కార్యకర్తలకు వివరించారు. సభ్యత్వ నమోదు ఎన్​రోలర్లుగా అందరి వివరాలు సేకరించండి మీరు చెప్పినవారికే పథకాలు అందుబాటులోకి తెస్తాం..ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రియంబర్స్​మెంట్​ఉద్యోగ కల్పన చేస్తామన్నారు.

ఉద్యోగ ఖాళీల ప్రకటన పచ్చి మోసం అబద్దం..

"కేసీఆర్ వచ్చాక ఒక్క నోటిఫికేషన్​ఇవ్వలేదు 2014 సెప్టెంబర్​7న లక్ష్యా 7 వేల ఉద్యోగ ఖాళీలున్నాయి. మరో 50 వేలు ఖాళీఅవుతాయి. ఏడాదిలో లక్షా 50వేలు పూర్తి అవుతాయని అబద్ధపు మాటలు చెప్పి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వం పీఆర్ సీ కమిటీలో బిస్వాల్​చైర్మన్​గా 4.91 లక్షల సాంక్షన్​పోస్టులలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కమిటీ చైర్మన్​బిస్వాల్​కమిటీ తేల్చింది. దానిని పక్కన పెట్టి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీలో 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. బిస్వాల్​కమిటీ తేల్చిన మరో లక్షా ఉద్యోగాలు ఏమైనట్లు. ఉన్న ఖాళీల విషయంలో దొంగలెక్కలు చెప్పే కేసీఆర్​ ఉద్యోగాలు ఇస్తానంటే తెలంగాణ నిరుద్యోగులు నమ్మరు. సోనియ్మ రాజ్యంలో 2 లక్షల ఉద్యోగ్యాలు కల్పించి తీరుతాం" అని అన్నారు.

'ప్రకటనకే పిచ్చోళ్లు అయ్యి పాలాభిషేకాలు చేస్తున్న కేసీఆర్ భజనపరులు ఒక నోటిఫికేషన్​కాదు దానికి ఓ జీవో లేదు ఖాళీ ప్రకటన ఇచ్చినందుకే అదికూడా అబద్ధాల ప్రకటనకే తెలంగాణ సమాజన్ని నిరుద్యోగులను మోసం చేయడానికే కేసీఆర్​ఈ రోజు ఉద్యోగ ప్రకటన చేశాడు తప్పితే నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ధి కేసీఆర్​లో లేదు. అది తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నాయకత్వలోని కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రజలు త్వరలో తెలుస్తారు' అని అన్నారు. అనంతరం సభ్యత్వ నమోదులో టార్​గేట్​చేరుకున్న కార్యకర్తలను రేవంత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్​మల్లు రవి, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News