Mayawati: రాష్ట్రపతిపై వ్యాఖ్యలు సిగ్గుచేటు

Mayawati Calls Chowdhury's 'Rashtrapatni' Remarks Shameful| కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

Update: 2022-07-28 12:52 GMT

న్యూఢిల్లీ: Mayawati Calls Chowdhury's 'Rashtrapatni' Remarks Shameful| కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తన కులతత్వ ఆలోచనను వీడాలని కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ట్వీట్ చేశారు. 'గిరిజన సమాజం నుంచి భారత అత్యున్నత పదవికి తొలి మహిళగా ద్రౌపది ముర్ముజీ ఎన్నిక కావడం చాలా మందికి నచ్చలేదు. ఆమెపై లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్య చాలా విచారకరం, అవమానకరం, అత్యంత ఖండించదగినది' అని మాయావతి ట్వీట్‌లో పేర్కొన్నారు. కులతత్వ ఆలోచనను కలిగి ఉన్నందుకు‌గానూ కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలని కోరారు.

ఇది కూడా చదవండి: ప్రపంచలోనే అతిపెద్ద భారత జాతీయ జెండా

Tags:    

Similar News