Rashmika Mandanna: జాతీయ అంబాసిడర్‌గా రష్మిక.. డీప్ ఫేక్ వీడియోపై మరోసారి రచ్చ

ప్రస్తుతం సైబర్ నేరాలు ఎంతలా పెరిగాయో అందరికి తెలిసిందే.

Update: 2024-10-15 10:18 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం సైబర్ నేరాలు ఎంతలా పెరిగాయో అందరికి తెలిసిందే. సెలబ్రిటీస్, నార్మల్ పర్సన్స్ అని కూడా లేకుండా.. కొంత మంది డీప్ ఫేక్ వీడియో (Deep fake video)లను క్రియేట్ చేసి సోషల్ మీడియా (Social media)లో వైరల్ చేస్తున్నారు. వీటిపై కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే మరికొందరు మాత్రం ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. అయితే.. ఇలాంటి డీప్ ఫేక్ వీడియో భాదితుల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక (Rashmika)ను భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్ (Ambassador) గా నియమించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రష్మిక ఓ వీడియో షేర్ చేసింది.

‘మనం డిజిటల్ (Digital) యుగంలో జీవిస్తున్నాము. అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ (Cybercrime) అత్యధిక స్థాయిలో ఉంది. నా డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి బాగా వైరల్ చేశారు. ఆ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. దాని ప్రభావాన్ని అనుభవించిన వ్యక్తిగా, ఈ ఆన్‌లైన్ (Online) ప్రపంచాన్ని రక్షించడానికి కఠినమైన చర్యలకు ఇది సమయం అని నేను నమ్ముతున్నాను. ఈ సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన (Awareness) కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను భారత ప్రభుత్వం (Government of India)తో కలిసి పని చేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. ఆ ఐ4సీ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador) గా ఉంటున్నాను. సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో చెప్పలేం.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. అందరూ కలిసి కట్టుగా పోరాడి.. సైబర్ (Cyber) నేర రహిత భారత్‌ను క్రియేట్ చేద్దాం. 1930కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.in ని సందర్శించడం ద్వారా సైబర్ నేరాలను నివేదించడానికి నేను అలాగే భారత ప్రభుత్వం మీకు సహాయంగా ఉంటాం’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక (Rashmika). తనకు ఎదురైన పరిస్థితి ఇంకొకరికి ఎదురుకాకుండా సైబర్ నేరాలపై అవగాహన పెంచడానికి ముందుకు వచ్చిన రష్మికపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Full View

Tags:    

Similar News