Pushpa-2: ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్.. ఏకంగా అన్ని భాషల్లో ‘పుష్ప-2’ రిలీజ్!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2).

Update: 2024-10-24 14:54 GMT

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’ (Pushpa-2). ‘పుష్ప ది రైజ్‌’ బ్లాకబస్టర్ (blockbuster) హిట్ సాధించడంతో.. దీనికి సీక్వెల్ (sequel)గా వస్తున్న ‘పుష్ప-2’పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా (Pan India) చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్-6 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు.

అయితే.. తాజాగా ఈ రిలీజ్ డేట్‌ను చేంజ్ చేస్తూ.. ఒక రోజు ముందుగానే పుష్ప రాజ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ (press meet) ఏర్పాటు చేసి.. ‘పుష్ప -2’ డిసెంబర్-5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నిర్మాతలు (producers) సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ (Interesting) విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా.. ‘పుష్ప-2’ ను వీలైనన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. దానికి సంబంధించి కొన్ని ప్లాన్స్ కూడా చేస్తున్నాం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ స్పానిష్, జాపనీస్, రష్యన్, చైనీస్.. ఇలా వీలైనన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ (International Languages)లో రిలీజ్ చేస్తాం. కాకపోతే ముందు పాన్ ఇండియా రిలీజ్ అయిన.. 2, 3 నెలలకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ (present) నిర్మాతల కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 


Similar News